అరకులోయ లో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఇవే..
జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు అరకులోయ మండలంలో పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో బ్రెస్ట్ ఫీడింగ్ కోసం తల్లులకు రూమ్స్ కేటాయించినట్టు సీడీపీఓ శారద పేర్కొన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ను అరకులోయ తాహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ ఆఫీసు, పెదలబుడు సచివాలయం, అరకు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి, పోస్టర్లు అంటించామని సీడీపీఓ తెలిపారు. తల్లులు ఈ సౌకర్యాలను గమనించి వాడుకోవాలని ఆమె కోరారు.