అరకు: పాకలపాటి రఘువర్మ విజయానికి దొన్నుదొర ప్రచారం
పాకలపాటి రఘువర్మ గెలిస్తేనే ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని RTC ప్రాంతీయ జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర అన్నారు. శనివారం అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో పర్యటించి ప్రచారం చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై అవగాహన ఉన్న రఘువర్మ వంటి వ్యక్తులు పెద్దల సభలో ఉంటే మేలు జరుగుతుంది. కావున ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని దొన్నుదొర కోరారు.