అరకు: నేటితో ముగిసిన పెసా చట్టం శిక్షణా తరగతులు
అరకులోయ మండలంలో పెసా చట్టం పై శిక్షణ తరగతులు నేటితో ముగిసాయని ఎంపీడీఓ లవరాజు తెలిపారు. 9 రోజుల శిక్షణలో 1800 మందికి పెసా చట్టం ఆవశ్యకత, గిరిజన ప్రాంత పరిరక్షణలో పెసా చట్టం పాత్ర, పెసా గ్రామసభ అవసరం, స్ధానిక వనరులపై పెసా గ్రామసభ అధికారాలు, గ్రామసభ తీర్మానాల అమలు గురించి ట్రైనర్లు మహేశ్వరరావు, సతీష్, ఉమాదేవి, జ్యోతి వివరించారు. శనివారం ఇరగాయి పంచాయితీ పెసా కమిటి, డ్వాక్రా, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు