logo

ఉపాధ్యాయ బహుజన సంఘాల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతల దుర్గారావును గెలిపించండి




2025 సం॥ ఉపాధ్యాయ శాసన మండలికి త్వరలో ఎన్నికలు జరగనున్న సందర్భముగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు (అరకు), పార్వతీపురం (మన్యం) జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గంలో బహుజన సంఘాల దాని మిత్ర సంఘాల అభ్యర్థిగా రాష్ట్ర ఎస్.సి., ఎస్.టి. టీచర్స్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు పోతల దుర్గారావు పోటి చేస్తుయున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్.సి., ఎస్.టి. బడుగు బహుజన ఉపాధ్యాయుల కోసం 1991 సం॥ ఎస్.సి., ఎస్.టి. టీచర్స్ ఫెడరేషన్ ను స్థాపించిన పోతల దుర్గారావు గారును సంఘ ఫౌందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మూడు దశాబ్ధాల పాటు ఉపాధ్యాయలోకానికి తమ ఉత్తమమైన ఉన్నతమైన నిస్వార్ధంగా సేవలను అందించిన ఉద్యమకారుడు, మన ముద్దుబిడ్డ జ్యోతిరావుపూలే, అంబేద్కర్ ఆశయాలలో నిరంతరం పనిచేస్తున్న మన బహుజనుల ఉద్యమనేత అనేక ఉమ్మడి ఉద్యమాలలో పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ప్రజా సంఘాలతోను సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న అభ్యర్తి పోతల దుర్గారావు ఎస్.టి.యు., డి.టి.ఎఫ్. యు.టి.ఎఫ్. ఎస్.సి. ఎస్.టి. యు.ఎస్. బి.టి.ఏ. అనేక ఉపాధ్యాయ సంఘాలతో పనిచేసి మంచి స్నేహ పూరిత సంబధాలు కలిగి మనకోసం ఎస్.సి., ఎస్.టి.టి.ఎఫ్. సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడ నడిపిస్తూ బదుగు బలహీన వర్గాల పీడిత జనాల హక్కు సాధన కోసం దళిత హక్కుల పదిరక్షణ సమితి సంఘంను నడిపిస్తున్న ఉద్యయ నేత జ్యోతిరావుపూలే, అంబేద్కర్, కొమరంభీం ఆలోచనలతో 35 సం॥లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, సామాన్య ప్రజలకు నిస్వార్ధ సేవలను నిరంతరం అందిస్తున్న నిస్వార్ధ నాయకుడు మన పోతల దుర్గారావు,

75
953 views