క్వారీ యాజమాన్యం దౌర్జన్యం రైతు ఆత్మహత్యాయత్నం
రోలుగుంట మండలం శరభవరం రెవిన్యూలో బొప్పెన కన్స్ట్రక్షన్ పై శరభవరం సాగు రైతులు ఆందోళన చేపట్టారు.ఈ కన్స్ట్రక్షన్ క్వారీలో గురువారం ఉదయం 9 గం"నుండి సాయంత్రం 4 గం"వరకు క్వారీ యాజమాన్యం ఎవరు కనిపించలేదు.సాయంత్రం 5 గం" దాటిన తర్వాత బొప్పెన కన్స్ట్రక్షన్ యాజమాన్యం లారీలతో వచ్చి దౌర్యంగా రైతులు వేసుకున్న టెంట్ ను తీసే ప్రయత్నం చేశారు.దీని గమనించిన సాగు రైతు జనమూరు సత్తిబాబు అడ్డుకునే ప్రయత్నం చేశాడు.ఆయనపై ఇద్దరు రౌడీషీటర్లు దౌర్జన్యం చేయగా సత్తిబాబు మన స్థాపానికి గురై అక్కడికక్కడే పాయిజన్ తీసుకోవడం జరిగింది.క్వారీ యాజమాన్యం పై ఎలాంటి ఆరోపణలు ఉండకూడదని కన్స్ట్రక్షన్ యాజమాన్యం అక్కడి నుండి జనుమూరు సత్తిబాబును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటన జరిగిన వెంటనే క్వారీలో లారీలను బయటకు తరలించారు.