విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
శ్రీకాకుళం :రాష్ట్ర విత్తన అభివృద్ధి సం స్థకు సరఫరా చేయాల్సిన రాగి పంట విద్యుత్‌శాఖ నిర్లక్ష్యంతో నిలిచిన ఘటన చోటు చేసుకుంది.ము న్సిపాలిటీ పరిధిలోని ఊ సవానిపేట గ్రామానికి చెందిన జి.అప్పల సూర మ్మ, జి.కోటవేణి అనే ఇద్ద రు రైతులు తమ ఐదు ఎకరాల పొలంలో వరి, రాగి పంటలను సాగు చేస్తూ ఏటా ఏపీ సీడ్స్‌కు ఇస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రాగి పంట సాగు చేసి ఏపీ సీడ్స్‌కు ఇవ్వడానికి అ గ్రిమెంట్ కుదుర్చుకు న్నారు. అయితే వీరి పొలంలో ఉన్న వ్యవసాయ మోటార్లకు అందించాల్సిన విద్యుత్ సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో గత నెల రోజుల నుంచి ఇబ్బందు లకు గురిచేయడం వల్ల ఈ ఏడాది రాగిపంట వేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో తమ భూములు ఉ న్నప్పటికీ ఆమదాలవలస సబ్‌స్టేషన్ పరిధి నుంచి విద్యుత్ సరఫరా జరిగేద న్నారు.అయితే కొంతమంది విద్యుత్ అధికారుల చేతివాటంతో కొన్నింటికి వి ద్యుత్ సరఫరా చేసి తమ మోటార్లకు నిలుపుదల చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై శ్రీకాకుళం విద్యుత్ ఏఈను ప్రశ్నించగా.. సబ్‌స్టేషన్ ఆమదా లవలస పరిధిలో ఉందంటూ వింతపోకడలతో ఏపీ సీడ్స్‌కు ఈ ఏడాది అగ్రి మెంట్ చేసినప్పటికీ రాగి పంట విత్తనాలు అందించలేకపోతున్నామని మహి ళా రైతులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ స రఫరా చేయాలని ఆదేశాలు ఇచ్చినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వహిం చడంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్‌శాఖ అధి కారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.