logo

నేటి నుండి పి4 సర్వే ప్రక్రియ ప్రారంభం: జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల జిల్లా /కలెక్టరేట్
🇮🇳 సున్నా పేదరికమే లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయ సిబ్బందిచే పి4 సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జి. రాజకుమారి ఎంపీడిఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పి4 సర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిపిఓ వేణుగోపాల్, డిఎల్డిఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🇮🇳ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ లో భాగంగా పేదరిక నిర్మూలనకు పి-4 (ప్రభుత్వ- ప్రైవేటు- ప్రజల భాగస్వామ్య) విధాన సర్వే ప్రక్రియను సచివాలయ సిబ్బందిచే నేటి నుండి పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జీరో పావర్టీ, ఉద్యోగాల సృష్టి, నైపుణ్యత పెంపు, రైతు సాధికారత, త్రాగునీటి రక్షణ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్వచ్ఛ ఏపీ, మానవ వనరుల వినియోగం, శక్తి వనరుల నిర్వహణ, సాంకేతిక జ్ఞానం పెంపు తదితర పది సూత్రాల అనుసంధానంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి సచివాలయంలో పది సూత్రాల పట్టికను అతికించాలన్నారు. సున్నా పేదరికమే లక్ష్యంగా పి4 సర్వే ద్వారా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న అతి నిరుపేదల జాబితాలు తయారు చేయాలన్నారు. చేపట్టిన సర్వే మార్చి 2వ తేదీలోగా పూర్తి చేసి నివేదికలు అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

3
1514 views