
మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అద్యక్షులుగా తొత్తడి వెంకట పద్మ గాంధీ నియామకం.
విశాఖపట్నం : హ్యూమన్ రైట్స్ ప్రొడక్ష
మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అద్యక్షులుగా తొత్తడి వెంకట పద్మ గాంధీ నియామకం.
విశాఖపట్నం : హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ జాతీయ అద్యక్షురాలు డాక్టర్ ఉన్నం జ్ఞాన సుందరి గారి ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిళ్ళా కన్నన్నాయుడు విశాఖపట్నం, విజయనగరం జిల్లా అద్యక్షులను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా వారి కార్యాలయంలో విశాఖపట్నం జిల్లా అద్యక్షురాలు తొత్తడి వెంకట పద్మ గాంధీ, విజయనగరం జిల్లా అధ్యక్షురాలు పోతిన అచ్యుతాంబలకు నూతన బాధ్యతలు అప్పగించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం కన్నన్నాయుడు మాట్లాడుతూ నేడు దేశ వ్యాప్తంగా దురాగతాలు పెరుగుతున్నాయని, మానవ హక్కులు అణచివేతలుకు గురౌతున్నాయాన్నారు. కావున మానవ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని అన్నారు.
విశాఖపట్నం జిల్లా అద్యక్షురాలు మాట్లాడుతూ బాలికలపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందిఅని అన్నారు. విజయనగరం జిల్లా అద్యక్షురాలు పోతిన అచ్యుతాంబ మాట్లాడుతూ స్త్రీల హక్కులు, బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని అన్నారు.ఈ అవకాశం కల్పించిన జాతీయ అద్యక్షులు డాక్టర్ ఉన్నం జ్ణాన సుందరి గార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.