logo

నవరసాల ఘంటసాల - ఘంటసాల సంగీత విభావరి -2 in RETRO RAGAS (రెట్రో రాగాస్ సంస్కృతిక సేవా సంస్థ రి.నం. 14/2025)

నిజాంపేట : ఎందరో మహానుభావులు....అన్నట్లు కొందరు మహనీయులు కారణజన్ములు అంటారు. వారు మన మధ్య ఉన్నా లేకపోయినా వారు గాత్రం ద్వారా, వారి పనుల ద్వారా ఎప్పటికి చిరంజీవులు గా ఉంటారు. అటువంటి వారిలో మహా గాయకులు పద్మశ్రీ. ఘంటసాల వారు ఒకరు. ఇప్పటికి వారి పాటలు మన మనో ఫలకాల పై నిలిచిపోయాయి అంటే అతిశాయొక్తి కాదు. ఆ మహానుభావుని వర్ధంతి సందర్భం గా వరల్డ్ క్లాస్ స్టూడియో "రెట్రో రాగాస్" అధినేత, ప్రముఖ గాయకులు,నటులు, కారయోకే జాకీ మరియు ఘంటసాల-ఎన్ .టి .ఆర్. జీవిత సాపల్య పురస్కార గ్రహీత అయిన శ్రీ. వి.ఎస్.మూర్తి గారు గతం లో చేసిన కార్యక్రమానికి కొనసాగింపు గా "నవరసాల ఘంటసాల " సంగీత విభావరి ఈరోజు అనగా 18.02.2025 మంగళవారం నాడు సా.4.00 నుంచి రాత్రి 8.00 వరకు జరపనున్నట్లు తెలిపారు.
ప్రత్యక్షం గా చూడలేనివారు రెట్రో రాగాస్ యూట్యూబ్ లైవ్ లో తప్పక వీక్షించాలని ఆయన నిన్న జరిగిన మీడియా సమావేశం లో కోరారు. అద్భుతమైన గాయనిగాయకుల స్వరార్చన ఈ కార్యక్రమం అని , ఇందులో ప్రముఖ గాయకులు అయిన శ్రీ.వి.ఎస్.మూర్తి గారు, శ్రీ రవీందర్ గారు, శ్రీ పార్వతయ్య గారు, శ్రీ. బి.ఎమ్. కృష్ణ గారు, డా. సతీష్ కుమార్ గారు, మరియు ప్రముఖ గాయనీమణులు అయిన శ్రీమతి, అనంత లక్ష్మి గారు, శ్రీమతి ఇందిరాగారు, శ్రీమతి లక్ష్మి శ్యామ్ గారు, శ్రీమతి రామలక్ష్మి గారు పాల్గొంటున్నారని శ్రీ వి.ఎస్. మూర్తి గారు తెలిపారు. తమ తల్లిదండ్రుల దీవెనలతో చక్కని స్టూడియో స్థాపించి , రెట్రో రాగస్ సంస్థ ఒక సేవ సంస్థ అని, పాటలు పాడాలనే కోరిక ఉండి, సరైనా అవకాశం రాని వారి కోసం లాభపెక్ష లేకుండా ఒక్కరికి, ఇద్దరికి కూడా రెట్రో రాగస్ స్టూడియో ఇవ్వగలుగుతునామని, అలాగే ఎందరో గాయనిగాయకులు రెట్రో రాగస్ లో చక్కగా పాడడం లో మెలకువలు నేర్చుకుని ఇప్పుడు అద్భుత ప్రతిభతో వెలుగొందుతున్నారని చెప్పడానికి తనకి ఎంతో సంతోషం గా ఉందని, రెట్రో రాగాస్ అధినేత శ్రీ వి.ఎస్. మూర్తిగారు తెలిపారు. స్టూడియో కావాల్సిన వారు 79939 78018 నంబర్ కి సంప్రదించాలని శ్రీ మూర్తిగారు తెలిపారు.

నేటి కార్యక్రమం రెట్రో రాగాస్ లైవ్ లో వీక్షించాలని ఆకాంక్షించారు.

103
15489 views