
రోలుగుంటలో భారీగా గంజాయి పట్టివేత
ఈరోజు అనగా తేదీ 15.02.2025 న ఉదయం సమయంలో, రోలుగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని కొంతలం – వడ్డిపా గ్రామాల మార్గంలో గంజాయి దాచి ఉంచినట్లు సమాచారం రావడంతో, ఎస్.ఐ. రామకృష్ణ , తన సిబ్బంది తో కలసి ఘటనాస్థలికి వెళ్ళి, అక్కడ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు రోలుగుంట మండలంలోని లువ్వసింగి గ్రామానికి చెందిన వ్యక్తి, మరొకరు ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా, చిత్రకొండ మండలంలోని పూర్ణ టీక్ పొదూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. అలాగే, వారి వద్ద నుండి జీడి తోటలో వారు దాచిన 75 కిలోల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు మరియు ఒక ద్విచక్ర వాహనం (హీరో కంపెనీ బైక్ నెంబర్ OD 30 E 7885)ను పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నారు.
మండలంలోని లువ్వసింగి గ్రామానికి చెందిన కొర్రా నవీన్ అను అతను, ఒడిశాకు చెందిన ఖిళా సోమనాథ్ నుండి సదరు గంజాయిని కొనుగోలు చేసి, తిరుపతి పట్టణంలో ఉన్న కొనుగోలుదారికి అమ్మడానికి ప్రయత్నించాడు. స్వాధీనం చేసుకున్న 75 కిలోల గంజాయి అంచనా విలువ సుమారు ₹3.75 లక్షలు. అరెస్టు చేసిన వ్యక్తులను నర్సీపట్నం జేఎఫ్‌సీఎం కోర్టు ముందు హాజరుపరిచారు, అక్కడ కోర్టు ఇద్దరికి 14 రోజుల రిమాండ్ మంజూరు చేసింది. తిరుపతికి చెందిన ఒక వ్యక్తి పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందం పంపబడును అని పత్రిక ప్రకటన ద్వారా C.I, కొత్తకోట వారు తెలియజేసినారు