logo

ఆళ్లగడ్డలో ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన త్రినేత్ర చిట్ ఫండ్ జప్తు

నంద్యాల జిల్లా న్యూస్ .ఆళ్లగడ్డ పట్టణంలోని మెయిన్ బజార్ శివాలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త త్రినేతచిట్ ఫండ్స్ అధినేత అట్లా మోహన్ రెడ్డికి చెందిన వ్యాపార సంస్థను గురువారం రోజున న్యాయవాది బంగి సుధీర్ యూనియన్ బ్యాంకు సిబ్బందితో కలిసి జప్తు చేసేందుకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థ పై తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడంతో కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి మల్లీశ్వరి ఆదేశాల మేరకు జప్తు చేసేందుకు కోర్టు సిబ్బంది ఆళ్లగడ్డకు చేరుకున్నారు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఏం జరుగుతుందోనని స్థానికులు టెన్షన్ గురయ్యారు

200
8196 views