logo

విద్యార్థులకు ప్రమాద బీమా, వారి భవిష్యత్ కు భరోసా

మెదక్ జిల్లా, పెద్ద శంకరం పేట, AIMA ప్రతినిధి లావణ్య దంతెల


ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అంగన్వాడీలు మొదలుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుని భావి పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. విద్యార్థుల విద్య భవిష్యత్తు కోసం ప్రతి విద్యార్థి కొరకై మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ ,ఉచిత పుస్తకాలు, స్కాలర్ షిప్స్, ఉపాధ్యాయ సిబ్బందికి జీత భత్యాలు, పాఠశాల భవనాలకు ఇతర మౌలిక సదుపాయాలకు ఇలా అనేక రకాలుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. కానీ విద్యార్థుల జీవితాలకు మాత్రం భరోసా కల్పిస్తున్న దాఖలాలు ఎక్కడ కనబడటం లేదు.
ఎక్కడో విద్యార్థులకు ప్రమాదాలు జరిగిన చోట ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియాకు మాత్రమే ప్రాధాన్యతను ఇచ్చే హడావిడి మాత్రమే జరుగుతుంది.
ప్రైవేటు పాఠశాలల్లో అయితే ప్రధానంగా బడ్జెట్ పాఠశాలల పరిస్థితి ప్రమాదాల విషయాలలో మాత్రం అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నాయి. పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోతే యాజమాన్యాల నిర్లక్ష్యం అని యాజమాన్యానితో కొంత సొమ్ము విద్యార్థుల తల్లిదండ్రులకు నష్ట పరిహారం గా అందిస్తున్నారు. కానీ ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఎప్పుడు ఈ ప్రమాద బీమా కోసం ఆలోచించిన పరిస్థితి అగుపించడం లేదు. ప్రైవేటు పాఠశాలలో వేల రూపాయలు ఖర్చుపెట్టి చదివించే తల్లిదండ్రులు ఇటువంటి ప్రమాద బీమాలకై ఖర్చు భరించేందుకు వెనకాడరు. ఆ దిశగా ప్రభుత్వం విద్యార్థుల ప్రమాద నిర్భంధ బీమా కోసం ఒక అడుగు వేస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. ప్రమాదాలలో అవయవాలు కోల్పోయిన పిల్లలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ మధ్య తపాల సంస్థ ద్వారా సంవత్సరంనకు కేవలం రూ. 335 లతో పది లక్షల ప్రమాదం బీమను తపాలా వినియోగదారులకు అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇదే మాదిరిగా విద్యార్థుల కోసం కూడా ఒక బీమాను తీసుకొస్తే బాగుంటుందని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు బీమా పేరుతో రైతులను ఆదుకుంటున్నట్లే విద్యార్థుల ప్రమాద బీమాను ఆలోచించి ప్రమాదాల విషయంలో వారికి భరోసా కల్పిస్తే వారు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
రోడ్డు ప్రమాదాలే కాకుండా ఇతర నీటి, పురాతన భవనాలు కూలి గాయ పడిన సందర్భాలు అనేకం. అంతే కాకుండా విద్యార్థుల ఆత్మహత్యలతో అసువులు చాలిస్తున్నారు. అలాంటి తల్లి తండ్రుల బాధ వర్ణనాతీతం.

పోలీసు రికార్డులలో నమోదు అయిన ప్రమాదాల లెక్క కంటే అనధికారికంగా ఉన్న లెక్క అధికమే. ప్రభుత్వ సహాయం ఎక్సగ్రెషియాకే పరిమితం చేయకుండా విద్యా కోసం ఖర్చు పెట్టే ఖర్చులోనే ప్రత్యేకంగా ప్రమాద భీమాలను జత చేసి బడ్జెట్లలో పొందుపరిస్తే బాగుంటుందని కోరుకుందాం. మరి విద్యార్థుల సంక్షేమాన్ని ఆశించి ప్రభుత్వం ఎంతవరకు ప్రమాద భీమా గురించి ఆలోచించి ముందడుగు వేస్తుందో చూడాల్సిందే.

*విద్యార్థులకు భరోసా ప్రమాద భీమా
పెద్ద శంకరం పేట ఎబివిపి మండల కన్వీనర్: దినేష్*

ఆర్థికంగా స్కాలర్షిప్ ల పేరిట ప్రభుత్వం ఆదుకుంటున్న విధంగా ఈ ప్రమాద బీమా పై కూడా ఆలోచించి ఆ దిశగా అడుగు వేయాలని ఏబీవీపీ పెద్దశంకరంపేట తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. ఓటు లేదని విద్యార్థులను విస్మరించటం తగదు, నేటి విద్యార్థులే మన భవిష్యత్ పాలకులు.
విద్యార్థుల ప్రమాద బీమాలకై ప్రత్యేకంగా విద్యార్థుల ప్రమాద బీమాను రాబోయే బడ్జెట్లలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు పొందుపరచాలని డిమాండ్ చేస్తున్నాము.

2
2559 views