హోలియదాసరి కులస్తుల సదస్సు...
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ - హైదరాబాద్
ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ మంద కృష్ణ మాదిగ గారు...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఎస్సీ వర్గీకరణలో గ్రూపు - 3 లో ఉన్న తమ కులాన్ని గ్రూప్ -1 లో చేర్చాలని కోరుతూ హోలియదాసరి కులస్తులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సదస్సులో ముఖ్య అతిథిగా శ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో తలెత్తిన లోపాల వలన అన్యాయానికి గురైన కులాలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నాయని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్ట రూపంగా వచ్చే లోపు లోపాలను సవరించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని కోరారు...
హోలియదాసరి కుల సంఘం నేత జహంగీర్ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, డా. పృథిరాజ్ యాదవ్ , సయ్యద్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -(MRPS)