logo

కలెక్టరేట్ ఎదుట మాంగ్ కులస్థుల ఆందోళన

ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం మాంగ్ కులస్థులు ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో మాంగ్ కులాన్ని గ్రూప్ 1 నుంచి తొలగించి గ్రూప్ 2 లో చేర్చాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు కాంబ్లే బాలాజీ డిమాండ్ చేశారు. నర్సింగ్ మోరే మాట్లాడుతూ మేము మాంగ్ (42) కులానికి చెందిన వారము. స్వాతంత్రం పూర్వం నుండి ఈ ప్రాంతంలో నివసిస్తున్నాము. మా కులవృత్తి మాదిగ సోదరులతో సమానంగా చెప్పులు కుట్టడం, డప్పులు కొట్టడం మా కుల వృత్తి. మా మాతృ భాష మరాఠి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపట్టిన ఎస్సీల వర్గీకరణలో మాంగ్ కులానికి సామాజిక మరియు భావ సారూప్యత, వృత్తి సారూప్యత ఒకే విధంగా కల్గిన మాదిగ సోదరులతో కలిసి బి-కేటగిరిలో చేర్చినారు. ప్రతిఫలంగా మాంగ్ కుల విద్యార్థులు విద్యా, ఉద్యోగ రంగాలలో అవకాశాలు పొందినారు. అలాగే రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కూడా అవకాశాలు దక్కినాయి.

కాని ప్రస్తుతం ప్రకటించిన ఎస్సీల వర్గీకరణలో మాంగ్ కులస్థులు అత్యంత వెనుకబడిన గ్రూప్-1 లో చేర్చి 1% రిజర్వేషన్ మాత్రమే కల్పించినారు. దీనితో మాంగ్ కులానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకు కారణం ఎస్సీల వర్గీకరణ అధ్యాయనానికి ప్రభుత్వం నిర్ణయించిన కమీషన్ డా. షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలోని ఏకపక్ష కమీషన్ మా కులం గురించి పూర్తి అధ్యాయనం చేయకపోవడం మాంగ్ కులాన్ని గ్రూప్-1 లో చేర్చాలని ఎవరు ప్రతిపాదించలేదు. కాని వారి ఇష్టానుగునంగా లేదా ఎవరి ప్రోద్బలం ద్వారానే గతంలో అభివృద్ధి చెందిన గ్రూప్-డి లో ఉన్నటువంటి అత్యంత సంపన్న వర్గం 1. పంబాల 2. మన్నె కులాలు ఉన్నటువంటి గ్రూప్ -ఏ లో చేర్చి మాంగ్ కులానికి తీవ్రమైన అన్యాయం చేశారు.
మాంగ్ కులస్థుల మాతృ భాష వేరైన సామాజిక మరియు కుల సారూప్యత కల్గిన మాదిగ కులం ఉన్నటువంటి గ్రూప్-2 లో చేర్చుటకు ప్రభుత్వానికి సిఫార్సు పంపగలరు. లేకపోతే అత్యంత సంపన్న కులాలలో కూడిన గ్రూప్-1 లో మాంగ్ కులాన్ని కొనసాగించినట్లయితే విద్యా, ఉద్యోగ, రాజీకయ, ఆర్థిక రంగాలలో అవకాశాలు లభించక మాంగ్ కులం అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
గ్రూప్ 1లో మాంగ్ కులస్థులను చేర్చడం అన్యాయమన్నారు. వెంటనే రా ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ 59 కులాలకు విభజించి రిజర్వేషన్లు పంపిణీ చేయాలన్నారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కాంబ్లే బాలాజీ,గాయక్వాడ్ సూర్యకాంత్, కాంబ్లే ఉద్ధవ్, మాంగ్ సమాజ్ నాయకులు పాల్గొన్నారు.

72
5015 views