పాణ్యం నియోజకవర్గం: -
వైసీపీ కి భారీ షాక్ 🔥37 వ వార్డ్ కార్పొరేటర్ గౌరు దంపతుల సమక్షం లో టీడీపీ లో చేరిక*
కల్లూరు అర్బన్ 37 వ వార్డ్ కార్పొరేటర్ షేక్ అయేషా సిద్ధిఖా వైసీపీ పార్టీ నీ వీడి పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి *గౌరు చరిత రెడ్డి* గారు మరియు ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి శ్రీ *గౌరు వెంకట రెడ్డి* గారి సమక్షం లో మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు
కార్పొరేటర్ షేక్ అయేషా సిద్ధిఖా గారి నీ గౌరు దంపతులు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారoగా ఆహ్వానించి,శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి గారు,నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కే పార్వతమ్మ గారు,కార్పొరేటర్ కే పరమేష్ గారు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు