ఫిబ్రవరి 15న జాతీయ సెలవుదినంగా ప్రకటించాలి.
అంతర్జాతీయ క్రీడాకారుడు, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ లీడర్ ఇస్లావత్ ఆలోజ్ నాయక్
బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి ఫిబ్రవరి 15 నాడు జాతీయ సెలవు దినం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ గారు, హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి భారతదేశ వ్యాప్తంగా తిరిగి యావత్ బంజారాలకు ఆదర్శపురుషుడయ్యారు. ఆంగ్లేయుల పై యుధం చేయడం ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, క్షేత్రధర్మాన్ని రక్షించడం వంటి బోధనలు చేశారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించుకొని జాతి చరిత్రను భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించేందుకు సెలవు దినంగా ప్రకటించాలని గిరిజన సంక్షేమ సంఘం తరపున ప్రభుత్వాన్ని కోరారు.