logo

పెద్ద శంకరంపేటలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ శంకర్..

మెదక్ జిల్లా, ఫిబ్రవరి 5, పెద్ద శంకరం పేట, ప్రజా కలం ప్రతినిధి లావణ్య దంతెల

సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. పేట ఎస్సై శంకర్..
పెద్ద శంకరంపేట్.. సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పెద్ద శంకరంపేట ఎస్సై శంకర్ పేర్కొన్నారు.. బుధవారం పేట పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు.. ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు ఓటిపి వివరాలు అడిగితే చెప్పవద్దని సూచించారు.. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సునీత.. పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు...

0
4316 views