logo

గిరిజనులకు కేంద్ర బడ్జెట్ లో తీవ్ర అన్యాయం.....! సేవాలాల్ విద్యార్థి సేన * రాష్ట్ర అధ్యక్షులు *గుగులోత్ సంతోష్ నాయక్......!!*

పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గతంలో ఎన్నడు లేని విధంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తీవ్ర అన్యాయం జరిగిందని *సేవాలాల్ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ నాయక్* ఒక ప్రకటనలో తీవ్రంగా ఆరోపించారు.......వికసిత్ భారత్ అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టిన కేంద్ర బిజెపి ప్రభుత్వం గిరిజనులను మరింత పేదరికంలో నెట్టే విధంగా బడ్జెట్ కేటాయింపులున్నాయని విమర్శించారు. మొత్తం 50,65,345 కోట్ల బడ్జెట్లో దేశ గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగబద్ధంగా కేటాయింపులు చేయాల్సిన 7 శాతం ప్రకారం గిరిజన సబ్ ప్లాన్ కు 3,54,574 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 1,29,249 కోట్లు మాత్రమే కేటాయించి గిరిజనులకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇందులోనే గిరిజన వ్యవహారాల శాఖకు గత ఏడాది 13,000 కోట్లు కేటాయించగా ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా కేవలం 1925 కలిపి 14,925 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు. గిరిజనుల అభివృద్ధికి నేరుగా ఉపయోగపడే రంగాల్లో కేటాయింపులు పూర్తిగా తగ్గించి కార్పోరేట్లు,బడా కాంట్రాక్టర్లు, ధనవంతుల ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చే రంగాల్లో మాత్రం గణనీయమైన కేటాయింపులు చేసిందని అన్నారు. ఉన్నత విద్యలో గిరిజన విద్యార్థులను మరింత ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం గతేడాది 240 కోట్లు కేటాయించగా ఈ ఏడాది కేవలం 2 కోట్లు మాత్రమే కేటాయించడం దేనికి సంకేతమో కేంద్రం ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లకు గతేడాది 440కోట్లు కాగా ఈ ఏడాది 313కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ లకు గతేడాది 2432 కోట్లు కేటాయించగా ఏడాది 30 కోట్లు మాత్రమే అదనంగా పెంచి చూపించారన్నారు. దేశంలో గణనీయంగా పెరుగుతున్న గిరిజన విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుంటే ఇవి ఏమాత్రం సరిపోవని ఆందోళన వ్యక్తం చేశారు. అర్థంపర్థం లేని పథకాల పేర్లు పెట్టి గిరిజనులను మాయ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ధరిత్రి ఆబా జన్ జాతీయ గ్రామ్ వికాస్ అభ్యాన్ పథకానికి గతేడాది కేటాయించిన 500 కోట్లు ఖర్చు చేయకుండానే ఈ ఎడాది ఏకంగా 2000 కోట్లకు పెంచిందని అన్నారు.

రాజ్యాంగబద్ధంగా 275(1) అధికరణ ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనుల అభివృద్ధికి గ్రాంట్ గా ఇవ్వాల్సిన నిధులను సైతం పెంచకపోవడం దుర్మార్గమని ఆరోపించారు. దీనికి గతేడా 1541 కోట్లు కేటాయించగా ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా ఎన్నికల ముందు హడావిడిగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని నిర్మించి ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ ఈ బడ్జెట్లో ఆంధ్ర తెలంగాణ యూనివర్సిటీలకు కలిపి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా గిరిజనులను మోసం చేసిందని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు హక్కుగా కేటాయింపులు చేయాల్సిన గిరిజన సబ్ ప్లాన్ లో సైతం గిరిజనుల అభివృద్ధికి ఏమాత్రం సంబంధంలేని వాటిలో భారీగా కేటాయింపులు చూపడం అన్యాయమన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన తెగల్లో పెరుగుతున్న నిరుద్యోగాన్ని రూపుమాపే విధంగా చిన్న పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి వంటి రంగాల్లో నిధులను అధికంగా కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. గిరిజనుల్లో పేదరికం,అనారోగ్యం రోజు రోజుకు పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో కూడా ఉపాధి హామీ పథకం, ఆరోగ్యం వంటి కీలక రంగాల నిధుల్లో కోత పెట్టడం కేంద్ర బిజెపి ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని తీవ్రంగా ఆరోపించారు......

1
6758 views