logo

ఫోటో : ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యం *మాచర్లలో ఘనంగా వసంత పంచమి వేడుకలు*

మాచర్ల : పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వసంత పంచమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్, వీరభద్రాపురం పాఠశాల, ఓక్ బ్రిడ్జి స్కూల్ లలో సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, గాదె కిరీటిరెడ్డి, ఓక్ బ్రిడ్జి చైర్మన్ కొమ్మారెడ్డి చలమారెడ్డి. మాట్లాడుతూ శుద్ధ పంచమి ఎంతో పవిత్రమైన రోజని, ఆరోజునే సరస్వతి దేవి పుట్టినరోజుగా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. అప్పటి నుండి సరస్వతి పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేపించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

6
137 views