జామైఉస్మానియా బస్ స్టాండ్ ను మింగేసిన అక్రమ పార్కింగ్.
సికింద్రాబాద్ రాంనగర్ రూటులో గల జామైఉస్మానియా బస్ స్టాండ్ పూర్తిగా అక్రమ పార్కింగ్ కు గురి అయింది. దీనితో అక్కడ బస్ షెల్టర్ లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అక్రమ పార్కింగ్ చేత బస్సులు రోడ్డు మీద ఆపవలసి వస్తోంది. ఈ కారణం చేత ఈ మార్గంలో పోయే వాహనాలకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని వ్యక్తమవుతోంది. అధికారులు తక్షణమే స్పందించి అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలను తొలిగించి బస్ షెల్టర్ ను పునరుద్ధరించాలని అచ్చటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.