ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రకాష్, షేక్ సలీమ్
ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రకాష్, షేక్ సలీమ్
============================
* కోశాధికారిగా కృపానందరెడ్డి
* గౌరవాధ్యక్షులుగా సాటి గంగాధరం
* మిగిలిన అన్ని పదవులూ ఏకగ్రీవం
చిత్తూరు, జనవరి 27
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) ఎన్నికలకు సంబంధించి గౌరవాధ్యక్షులుగా సాటి గంగాధరం ( ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు ), అధ్యక్షులుగా బి ప్రకాష్ ( సీకేఎన్ న్యూస్, చిత్తూరు ) ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎమ్మెస్సార్ మున్సిపల్ కాంప్లెక్స్ లో గల ఏపిడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ఎన్నికల నామినేషన్ దాఖలు కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జిల్లా అధ్యక్షులుగా బి ప్రకాష్ తో పాటు, ప్రధాన కార్యదర్శిగా షేక్ సలీం ( ఎన్ టివి, పుంగనూరు ), కోశాధికారిగా పి. కృపానందరెడ్డి ( నేటి మనదేశమ్ దినపత్రిక, చిత్తూరు ), వర్కింగ్ ప్రెసిడెంట్ గా గిరిశేఖర్ ( ఆంధ్రజ్యోతి, పుంగనూరు ), ఉపాధ్యక్షులుగా పి. రాజేంద్రనాయుడు ( టీవీ 5 చిత్తూరు ), ఆర్ చంద్ర ( వార్త, తవణంపల్లి / కాణిపాకం ), ఈ దేవరాజలు ( ప్రజాశక్తి, ఎస్ఆర్ పురం ), మహమ్మద్ సైపుల్ల ( ఆర్ టివి, పుంగనూరు ), జగన్నాథరెడ్డి( సికేఎన్ న్యూస్ కుప్పం ), జి లక్ష్మీనారాయణ ( సుమన్ టీవీ, కుప్పం ) ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నరేంద్రబాబు ( ప్రజాశక్తి, రామకుప్పం ), ప్రచార కార్యదర్శిగా ఎస్జే దినేష్ కుమార్ ( కురుక్షేత్రం, చిత్తూరు ), ఎన్నికయ్యారు. అదే విధంగా జిల్లా సంయుక్త కార్యదర్శులుగా ఎం శ్రీనివాసులు ( ప్రజాశక్తి, పుంగనూరు ), కే రామయ్య ( వార్త, పుంగనూరు ), టీఎస్ విజయ్ ( హెచ్ఎం టీవీ, కార్వేటినగరం ), యాదవేంద్రరెడ్డి ( పిసిఎన్ న్యూస్, చిత్తూరు), గందోడి హరిప్రసాద్ ( కురుక్షేత్రం ఎడిటర్, చిత్తూరు ), కేజీ నాగరాజు ( మనం దినపత్రిక కుప్పం ), ఏ జయప్రకాష్ ( ప్రైమ్ - 9 న్యూస్, జీడి నెల్లూరు ), గౌరవ న్యాయ సలహాదారులుగా ప్రకాష్ ( సాక్షి, పుంగనూరు ), గౌరవ సలహాదారులుగా ముత్యాలు కేసి టీవీ అధినేత ) ప్రభునాయుడు ( పిసిఎన్ న్యూస్ అధినేత చిత్తూరు ), బి జగదీష్ ( సికేఎన్ న్యూస్ ఎడిటర్, చిత్తూరు ), వి కృష్ణ ( ఫ్రీ లాన్సర్/ సీనియర్ జర్నలిస్ట్ ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా చంద్రమోహన్, జిల్లా ఎన్నికల అధికారులుగా సాటి గంగాధరం, చల్లా జయచంద్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గ కమిటీ ప్రతినిధులు తమ రెండేళ్ల పదవి కాలంలో జర్నలిస్టులకు తలెత్తే అన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. అదే విధంగా జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఏ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, సీనియర్ జర్నలిస్టులు కృష్ణ,
కేశవులు, కడియాల మహేష్ బాబు, మునిరాజులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.