logo

పత్రికా ప్రకటన (25.01.2025) కర్నూలు జిల్లా... కానిస్టేబుల్ అభ్యర్దులకు ముఖ్య గమనిక.... కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపియస్ గారు.



పోలీసు కానిస్టేబుళ్ళ అభ్యర్ధులకు ఈవెంట్స్ గత నెల 30 వ తేదీ ప్రారంభమైనప్పటి నుండి వివిధ కారణాలతో ఇప్పటివరకు గైర్హాజరు అయిన అభ్యర్దులు ఈ నెల జనవరి 27 వ తేదిన దేహదారుడ్య పరీక్షలకు హజరుకావచ్చని కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపియస్ గారు ఒక ప్రకటనలో శనివారం తెలిపారు.

అభ్యర్దుల విద్యార్హతల సర్టిఫికెట్స్ , క్రిమీ లేయర్, కుల ధ్రువీకరణ పత్రాలు , స్టడీ సర్టిఫికేట్స్ మరియు ఇతర స్టేజ్ -1, స్టేజ్ – 2 లో అప్ లోడ్ చేసుకున్న
మేరకు సరైన ధ్రువ పత్రాలు, ఒరిజినల్స్ మరియు దానికి సంబంధించిన జిరాక్స్ లు అన్నియు సక్రమంగా ఉండే విధంగా అభ్యర్దులు తీసుకొని రావాలసిందిగా విజ్ఞప్తి.

సరైన ధ్రువ పత్రాలు లేకున్నచో అభ్యర్దులు తిరిగి వెనకకు పంపబడును.

కాబట్టి జాగ్రత్తగా నోటిఫికేషన్ లో తెల్పబడిన నిబంధనలను అభ్యర్దులు చదువుకుని ఆ మేరకు సరైన ధ్రృవ పత్రాలు తీసుకోని రావాలని తెలిపారు.

ఎత్తు, ఛాతీ కొలతలు, తదితర అంశాలలో అప్పీలు చేసుకున్న అభ్యర్థులకు తూనికలు, కొలతల అధికారులు మరియు మెడికల్ ఆఫీసర్ల సమక్షంలో ముగింపు రోజైన జనవరి 28 వ తేదీన అవకాశం కల్పించబడునని తెలిపారు.

జిల్లాలో గత నెల 30 వ తేదీ నుండీ కొనసాగుతోన్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య (PMT, PET) పరీక్షలు జనవరి 28 వ తేది (మంగళవారం ) ముగియనున్నాయని కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపియస్ గారు తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.
#BinduMadhavIPS
#APPOLICE100
#APPolice
#appolice
#kurnoolpolice
#AndhraPradeshPolice
#indianpolice
#IPS
#ipsofficer
#upsc
#ipsdream
#ipspassion
#friendlypolice
#saynotodrugs
#factionfreevillages
#governmentjobs
#telugumotivation
#inspiring
#villagepeople
#motivation
#PoliceAwareness
#CommunitySafety
#PublicSafety
#LawEnforcement
#CrimePrevention
#PoliceCommunity
#PoliceSupport
#EmergencyResponse
#SafetyTips
#CivicResponsibility

6
1264 views