నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడమే న లక్ష్యం లక్ష్మీ కాంత్ రావు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
వెనుకబడ్డ జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్, మంగుళూర్ నర్సింగరావుపల్లి, మాగి, గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం మొత్తం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడం తన లక్ష్యమని చెప్పారు.
గ్రామాల్లో పర్యాటక, విద్య, వైద్య, రోడ్డు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు అనేక పథకాలను చేపడుతున్నట్టు వెల్లడించారు.
అలాగే, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పిట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి నాయకులు ప్రజాపండరి గుర్రపు శ్రీనివాస్ ఆయా గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు