
కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ స్వచ్ఛంద సంస్థ 2025 సంవత్సరపు క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ జాతీయ ఎన్.జి.ఓ(పౌర మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ) యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు షబ్బీర్ అలీ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ చేస్తున్న స్వచ్ఛంద సేవలు ఆదర్శ దాయకమని ఎంతో స్ఫూర్తిదాయకమని అలాగే ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగిస్తూ, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరునికి కలిగి ఉన్నటువంటి వారి వారి హక్కులను తెలియజేస్తూ, వారిని చైతన్య పరుస్తూ, విద్య మరియు వైద్య సేవలు అందిస్తున్న విధానాన్ని ఆయన అభినందించారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫునుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా తనను సంప్రదించవలసినదిగా పేర్కొన్నారు. అలాగే సంస్థ వ్యవస్థాపకులు మంచి కట్ల అనిల్ చేస్తున్న కృషి అమోఘం అన్నారు. కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు అయినటువంటి మంచికట్ల అనిల్ కుమార్ ను సమాచార కమిషనర్ గా నియమించుటకై సంస్థ తరఫునుంచి వినతి పత్రాన్ని షబ్బీర్ అలీకి అందివ్వడం జరిగింది. ఇట్టి విషయంపై షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి దృష్టికి తను ఈ విన్నపాన్ని తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నార్త్ జోన్ ఇంచార్జ్-1 కరీముద్దీన్ కార్యదర్శులు కాకర్ల అశోక్ , శివ చంద్రం, జిల్లా కోఆర్డినేటర్. షేక్ ముజీబ్, మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సభ్యులు ఎం డి. యూసోఫుద్దీన్ , సయ్యద్ మెహ్రజొద్దీన్, బి. సాయిలు కె. మల్లికార్జున్, మీర్జాపురం రామ కృష్ణ , డి. భాస్కర్ నయీమ్, వసంత్ పాటిల్, అబ్దుల్ జలీల్ , మొహమ్మద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.