logo

జర్నలిస్టుల సంక్షేమమే ఏపీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం

*జర్నలిస్టుల సంక్షేమమే ఏపీడబ్ల్యూజేఎఫ్ లక్ష్యం*

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఉద్యమాలు నిర్వహిస్తుందని రాష్ట్ర నాయకులు కవరికుంట్ల జయరాజ్ జిల్లా ఎన్నికల అధికారి చల్లా జయచంద్ర, జిల్లా నాయకులు బాలసుబ్రమణ్యం తెలిపారు. బుధవారం కార్వేటినగరం మండల కేంద్రంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరులో ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి నిధులు కేటాయించాలని అక్రిడేషన్ కార్డు మంజూరులో సరళ తరంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులో పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేసిన విధంగా జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యాన్ని 15000 రూపాయలు ఇవ్వాలని కోరారు జర్నలిస్టులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కోరారు జర్నలిస్టుల సంక్షేమం కోసం అందరూ ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు అనంతరం జిల్లా ఎన్నికల అధికారి చల్లా జయచంద్ర నియోజకవర్గ కమిటీకి ఎన్నికలు నిర్వహించారు సభ్యులు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నికైన కమిటీని రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది

ఏపీడబ్ల్యూజేఎఫ్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ కమిటీ
*అధ్యక్షులు బి మోహన్ దాస్ మహా న్యూస్ టీవీ , వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం మునికృష్ణ సుమన్ టీవీ, ఉపాధ్యక్షుడులుగా మోహన్ రెడ్డి ప్రజాశక్తి, శరవణ కుమార్ వార్త, ప్రధాన కార్యదర్శిగా దేవరాజులు, ఆంధ్రప్రభ, ఆర్గనైజం కార్యదర్శిగా ఏం సుబ్రహ్మణ్యం సాక్షి టీవీ, సహయ కార్యదర్శులు మహేంద్ర సూర్య, కే సుధాకర్ ప్రజాశక్తి, కోశాధికారి రూప్ చంద్రారెడ్డి ఆంధ్రప్రభ,*

2
1163 views