అర్హులకు సంక్షేమ ఫలాలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్..
పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, డెస్క్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. బుధవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామపంచాయతీలో ప్రజాపాలన గ్రామసభ లో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకాలు నిరంతర ప్రక్రియలు కొనసాగుతాయి. అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మండల ప్రత్యేక అధికారి శ్రీపతి, ఎంపీడీవో గంగాధర్, తాసిల్దార్ బిక్షపతి, ఐకెపి ఎపిఎం రాంనారాయణ గౌడ్, వివిధ శాఖల అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.