logo

బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త ఆదాయ పన్ను బిల్లు దేశంలో త్వరలోనే నూతన ఆదాయపన్ను చట్టం రానుంది.


Income Tax: బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త ఆదాయ పన్ను బిల్లు!
63 ఏళ్లనాటి చట్టం స్థానంలో కొత్త చట్టం?
దేశంలో త్వరలోనే నూతన ఆదాయపన్ను చట్టం రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 63 ఏళ్ల కిందటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ నూతన చట్టం రెండు భాగాలుగా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల ఈ కొత్త బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకరించడంతోపాటు, అందరికీ అర్ధమయ్యే భాషలో దీనిని తీసుకురానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

32
2249 views