logo

అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి తాసిల్దార్ వేణుగోపాల్...

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, డెస్క్ : ప్రజాపాలన గ్రామ సభలకు ప్రజల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తహసీల్దార్ " వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్ తెలిపారు. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో ప్రజా పాలన గ్రామసభ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామసభలలో రేషన్ కార్డ్, రైతు భరోసా,ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్ల కోసం తమ దరఖాస్తులను గ్రామసభలలో అందజేశారని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, పంచాయతీ సెక్రటరీ సౌజన్య, గ్రామస్థాయి అధికారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

2
711 views