అంబేద్కర్ ను గౌరవించని మనువాదులు.
- రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
- అమిత్ షా రాజీనామా చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
- గో బ్యాక్ అమిత్ షా - వామ పక్ష నేతలు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist-
అంబేద్కర్ ను గౌరవించని మనువాదులు.
- రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం
- అమిత్ షా రాజీనామా చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
- గో బ్యాక్ అమిత్ షా - వామ పక్ష నేతలు
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist-
విశాలాంధ్ర -
విజయవాడ(చిట్టినగర్): మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను గౌరవించుకుంటూ, మనకందించిన భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద బి ఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ లో అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా నగరంలోకి విచ్చేసిన సందర్భంగా, వ్యాఖ్యలకు నిరసనగా సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీఎం జిల్లా నాయకులు డోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన "గో బ్యాక్ అమిత్ షా" అంటూ నినాదాలతో జరిగిన నిరసన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ దేశ చరిత్రలో లేని విధంగా, సాక్షాత్తు పార్లమెంటులో అంబేద్కర్ ను అవమానించే విధంగా దిగజారి మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాను వెంటనే రాజీనామా చేయించాలని, లేదా బర్త్ రఫ్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్ర ఉద్యమం, రాజ్యాంగం పైన, రచించిన బిఆర్ అంబేద్కర్ పై గౌరవం, విశ్వాసం లేని బిజెపి నాయకులు పదే పదే కించపరిచే విధంగా మాట్లాడటం దారుణం అన్నారు. 2024 ఎన్నికల సందర్భంలో పార్లమెంటులో 400 స్థానాలు ఇస్తే, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని బిజెపి సీనియర్ నాయకులు అనంత వెంకయ్య చాలా స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. బిజెపి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ 1949 నవంబర్ నెల ప్రచురించిన ఎడిషన్ లో మాకు లౌకిక రాజ్యాంగం నచ్చదని, మను స్ఫూర్తి ఆధారంగా రాజ్యాంగం ఉండాలని, హిందూ మతప్రాతిపదికన దేశం నడవాలని తమ అభిప్రాయాన్ని చెప్పారని తెలిపారు. వీరూ రాజ్యాంగం లేకుండానే అధికారంలోకి వచ్చారా...? అని బిజెపి నాయకులను ప్రశ్నించారు. రాజ్యాంగం అమలులో ఉంది కాబట్టే, పదవుల్లో ఉన్నారని హితవు పలికారు. దేశమంతా అమిత్ షా వ్యాఖ్యలపై ఖండిస్తుంటే, మన రాష్ట్రంలో అమిత్ షా వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఖండించకపోవడం దారుణమన్నారు. దాగుడుమూతలు ఆడకుండా అమిత్ షా వైఖరిని ఖండించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తాననే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అమిత్ షాను రాజీనామా చేయించాలని, లేదా నరేంద్ర మోడీని ఒప్పించి బర్తరఫ్ చేయించాలని కోరారు. లేనిపక్షంలో అమిత్ షా రాజీనామా చేసేంతవరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని హెచ్చరించారు. మహనీయుడు అంబేద్కర్ ను గౌరవించుకునేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జరిగే కార్యక్రమాలలో దేశాభిమానులు, శ్రేయోభిలాషులంతా పాల్గొవాలని పిలుపునిచ్చారు.
సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ఆధ్వర్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడుతుంటే పార్లమెంటులో బిజెపి పెద్దలంతా బల్లలు చరిచారని, దీనిని గమనిస్తుంటే మోడీ భజన చేస్తున్నారని తెలుస్తుందని విమర్శించారు. రాముడు భజన చేస్తే మోక్షం కలుగుతుందని వీరికి హితవు పలికారు. మోడీ కన్నా అంబేద్కర్ చిన్నవాడా..? అని ప్రశ్నించారు. వీరికి మనువాదం తలకెక్కిందని దుయ్యబట్టారు. నాడు స్వాతంత్ర పోరాటంలో సామ్రాజ్యవాదులతో పోరాడి, త్యాగాలు చేస్తే, అదే సందర్భంలో వాజ్ పాయ్ బ్రిటిష్ వారికి లొంగిపోయి సిపాయిలతో పని చేస్తానని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేశారు. గాంధీని చంపిన సనాతన హిందువు గాడ్సే కు డి కట్టాలనుకోవడం నిజం కాదా ..? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టుల చరిత్ర అజరామరమని తెలిపారు. పార్లమెంట్ లో అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా ను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు డి హరినాథ్, పోలారి, ఎం సీపీఐ యు ఖాదర్ భాష, సీపీఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ వీరు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ లో అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్త్ రఫ్ చేయాలని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ పార్లమెంట్ లో జరిగిన దుర్మార్గ సంఘటన బి ఆర్ అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను నరేంద్ర మోడీ ఖండించకపోవడం అత్యంత దారుణం అన్నారు. భారతదేశంలో పాలకవర్గాలు విశాల మనస్తత్వం కలిగి ఉండాలని హితవు పలికారు. వెంటనే అమిత్ షాను రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ వామపక్షాల నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవీంద్రనాథ్, కే రామాంజనేయులు, నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కీ లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి బి. నా సర్ జి, నగర పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు , పంచదారల దుర్గాంబ, కొట్టు రమణారావు, ఓర్సు భారతి, నగర నాయకులు
ఏ ఆర్ ఆంజనేయులు, కే ఆనందరావు, రామస్వామి, దుర్గాసి రవణమ్మ, సీపీఎం మాజీ కార్పొరేటర్ కె శ్రీదేవి, నాయకులు సిహెచ్ సుప్రజ, ఆండ్ర మాల్యాద్రి, పి ఓ డబ్ల్యు నేత పద్మ, తదితర వామపక్ష నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.