logo

జన ప్రజావాణి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపులో శుక్రవారం నాడు జన ప్రజావాణి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తన చేతుల మీద ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజావాణి దినపత్రిక ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ఎల్లప్పుడూ వాస్తవాలను ప్రజల వద్దకు చేరవేస్తూ నిజాలను నిర్భయంగా రాస్తూ ఎంతో ఆదరాభినాలను చూరగొందని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజావాణి దినపత్రిక రిపోర్టర్ నాగేష్ గౌడ్, సాయి పటేల్, సంతోష్ మేస్త్రి,బిచ్కుంద మాజీ జెడ్పిటిసి నాగ్ నాథ్ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, మద్నూర్ మండల్ యూత్ అధ్యక్షుడు హనుమంత్ యాదవ్ హనుమాన్ స్వామి, విట్టల్ గురుజి, జూబ్రి సురేష్, దిగంబర్ ,సచిన్, విట్టల్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

0
1203 views