logo

ప్యూటీ సీఎం పదవి రాజ్యాంగంలో ఉన్నదా...? డిప్యూటీ సీఎంకు నిర్దిష్టమైన అధికారులు ఉన్నాయా...,?

ప్యూటీ సీఎం పదవి రాజ్యాంగంలో ఉన్నదా...?

డిప్యూటీ సీఎంకు నిర్దిష్టమైన అధికారులు ఉన్నాయా...,?

డిప్యూటీ సీఎంను తొలగించే లేదా భర్తీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది...?

డిప్యూటీ సీఎం ఇతర మంత్రులతో సమానమేనా...?

డిప్యూటీ సీఎం తీసుకునే నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయా...?

-- ప్రజా సంకల్ప వేదిక - ఆంధ్రప్రదేశ్--


భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) లో డిప్యూటీ సీఎం పదవి గురించి ప్రస్తావన లేదు.

ఉపముఖ్యమంత్రి అనే పదవికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు కనుక చట్టబద్ధంగా డిప్యూటీ సీఎం ఏమీ చేయలేరు.

డిప్యూటీ సీఎంకు నిర్దిష్టమైన ఆర్థిక లేదా పరిపాలనా అధికారాలు ఉండవు.

అందుకే డిప్యూటీ సీఎం పదవితో పాటు వివిధ శాఖలను కేటాయించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు.

తద్వారా అయనకు కూడా ప్రత్యేక ప్రోటోకాల్, భద్రత లభిస్తాయి.

ఇతర క్యాబినెట్ మంత్రుల మాదిరిగానే డిప్యూటీ సీఎం కూడా రాష్ట్రంలోని అందరు మంత్రులతో పాటు సమానంగా పరిగణించబడతారు.

ఆయనను కూడా ముఖ్యమంత్రి నియమిస్తారు.

రాజకీయ సమీకరణాలు మారితే డిప్యూటీ సీఎంను తొలగించే లేదా భర్తీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది.

ఇక ర్యాంక్, అలవెన్సుల పరంగా డిప్యూటీ సీఎం పదవి కేబినెట్ మంత్రితో సమానం.

కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవి రెండో అత్యున్నత పదవిగా చెబుతూ ఉంటారు.

రాజ్యాంగబద్ధమైన పదవి కానందున, దానికంటూ ప్రత్యేక పాత్ర, పని గురించి స్పష్టత ఇవ్వలేదు.

వీరికి ఇతర కేబినెట్ మంత్రుల మాదిరిగానే శాఖలు కేటాయిస్తారు.

ఇది కేవలం రాజకీయ వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్న ఒక భాగం కాబట్టి ముఖ్యమంత్రి వద్దకు చేరే ప్రతి ఫైళ్లు డిప్యూటీ సీఎం ద్వారా వెళ్లేందుకు అవకాశం ఉండదు.

అదే ప్రభుత్వ ఉద్యోగాల పరంగా చూస్తే ఏదైనా శాఖకు సంబంధించిన డైరక్టర్ వద్దకు ఫైల్ వెళ్లాలంటే డిప్యూటీ డైరక్టర్ ద్వారానే వెళ్తుంది. ముందు డిప్యూటీ డైరక్టర్ పరిశీలించిన తరువాత డైరక్టర్ వాటిని ఫైనల్ వెరిఫికేషన్ చేసి ఆమోదిస్తారు.

డిప్యూటీ సీఎం తనకు బాధ్యతలు అప్పగించిన శాఖల ఫైళ్లను మాత్రమే చూస్తారు.

మంత్రి మండలిలో డిప్యూటీ సీఎం పదవి రెండో అత్యున్నత పదవి అయినప్పటికీ, ఒక వేళ ముఖ్యమంత్రి ఏవైనా అనివార్యకారణాల వల్ల రాష్ట్రంలో లేకపోతే... స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు.

ఒక వేళ వాటిని తీసుకున్నా అవి చెల్లుబాటు కావు.

అయితే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే ముఖ్యమంత్రి స్థానంలో డిప్యూటీ సీఎం కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించవచ్చు.

7
3450 views