అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
నిర్మల్లో గాలిపటాల సందడి
నిర్మల్ లో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గాలిపటాలు ఆకాశంలో చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి.
చైనా మాంజకు బదులుగా మామూలు దారాలను వాడుతున్నారు. ఒక పక్క ఆడవాళ్లు సంక్రాంతి ముగ్గులతో మరియు పిండి వంటలతో బిజీగా ఉన్నారు. ఒకపక్క యువకులు పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ కేరింతల కొడుతూ డీజే బాక్స్ లు పెట్టుకుని ఆనందంగా ఈ సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు.