logo

శంబర పండుగ బందోబస్తు ఏర్పాట్ల పై చర్చ....



పార్వతీపురం మన్యం జిల్లా లోని శంబర గ్రామం లో ఉత్తరాంద్ర ఆరాధ్య దేవత భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా,గిరిజన దేవతగా పేరు గాంచిన శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతర పండుగ తేది 27,28,29న అంగరంగ వైబవంగా జరగబోయే సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు నిమిత్తం పోలీస్ అధికారులతో , జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి, సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు నిర్వహించాల్సిన విధి నిర్వహణ,తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు.
శంబర పోలమాంబ అమ్మవారి జాతర, గిరిజన జాతర పండగను తిలకించేందుకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి ఎక్కువగా ప్రజలు, భక్తులు గ్రామానికి వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా వారి రాకపోకలకు, భద్రతకు ఎటువంటి అవాంతరం లేకుండా చర్యలు చేపట్టాలని, ఆలయల ప్రాంగణం,క్యులైన్ లో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ముఖ్యంగా తోపులాటకు తావు లేకుండా ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా, గట్టి భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక క్రైం బృందాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సమావేశంలో పార్వతీ పురం ఏఎస్పీ అంకిత సురాన, సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు, సాలూరు రూరల్ సిఐ రామకృష్ణ, సాలూరు రూరల్ ఎస్ఐ నరసింహమూర్తి, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్, మక్కువ ఎస్సై వెంకట రమణ పాల్గొన్నారు.

1
1941 views