
ఈనెల 18వ తేదీన నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు జిల్లాలో 14 సెంటర్లలో ఏర్పాటు
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు పటిష్ఠంగా చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశాలు.
కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర (లోకల్ బాడీస్) శ్రీ శ్రీనివాస్ రెడ్డి నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం లైన్ డిపార్ట్మెంట్స్ తో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈనెల 18వ తేదీన నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు జిల్లాలో 14 సెంటర్లలో ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి సెంటర్ కు చీఫ్ సూపరింటెండెంట్ , డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మరియు ఇన్విజిలేటర్లను నియమించడం జరిగింది.
అడిషనల్ కలెక్టర్ గారు లైన్ డిపార్ట్మెంట్స్ అయినా ఎలక్ట్రిసిటీ, మెడికల్, పోలీస్, మున్సిపల్ - గ్రామపంచాయతీ, వివిధ డిపార్ట్మెంట్స్ తో సమావేశం నిర్వహించి పటిష్ఠమైన ఏర్పాట్లు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ప్రతి సెంటర్లోనూ విద్యార్థులకు సౌకర్యంగా త్రాగునీరు ఏర్పాటు చేయవలనని మరియు పరిసరాలు శుభ్రంగా ఉంచవలనని ఆదేశించినైనది.
ప్రవేశ పరీక్ష సమయము ఉదయం 11:30 నుండి 1:30 వరకు ఉంటుందని తెలియజేశారు.
సంబంధిత అధికారులకు
నవోదయ ప్రవేశపరీక్షకు అన్ని రకాల ఏర్పాట్లను పటిష్ఠంగా పూర్తి చేయవలనని ఆదేశించడం జరిగింది.