
బిట్స్ లో ఘనంగా ఫుడ్ ఫెస్ట్
స్థానిక భూపాలపల్లి పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో ఆహార పదార్థాల ప్రదర్శనను(ఫుడ్ ఫెస్ట్) ను పురస్కరించుకొని విద్యార్థులు వివిధ వంటకాల ప్రదర్శనను నిర్వహించారు. యూకేజీ చదువుతున్న విద్యార్థులందరూ ఉపాధ్యాయునిలు నిర్దేశించిన వంటకాలను వారి తల్లిదండ్రుల సహకారంతో తయారు చేయించి తిను బండారాలపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాఠశాల గౌరవ తల్లితండ్రులు ప్రదర్శనలో వివిధ ఆహార పదార్థాలను రుచి చూసి ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన బాలాజి పాఠశాల యాజమన్యంని అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రిన్సిపాల్ శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఎదుగుతున్నటువంటి పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, వివిధ రకాలయినటువంటి ఆహార పదార్థాలను అందించడం ద్వారా పిల్లలకు మంచి ఆరోగ్యము , శరీర చురుకుదనం మరియు వారి మానసిక స్థితి ఎంతో ఉల్లాసంగానూ ఉంటుందని అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు వివిధ రకాలైనటువంటి అనేక కార్యక్రమాల పైన అవగాహన కల్పించడంలో బిట్స్ పాఠశాల ముందంజలో ఉంటుందని అన్నారు. అదేవిధంగా విద్యార్థులందరు చక్కని ఉపాధ్యాయునులు, తల్లిదండ్రుల సహకారంతో ఆహార ప్రదర్శన చేశారని, ఈ ప్రదర్శన విజయవంతం కావడంలో సహకరించిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినిలు అనిత, స్వాతి, మౌనిక, లత, స్వరూప,ఝాన్సి ,స్రవంతి , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.