
ఏ గుడిలో అయినా సరే! మ నం ఏ ఏ సేవలు చేయొచ్చు?."
భగవంతుడికి మనంచేసేగొప్పసేవ లలో ఒకటి మన శరీరంతో ఒక సా మాన్యుడిలా సేవ చేయడం.
ఆ సేవ ఒక దేవాలయంలో చేస్తే! ఇంకా గొప్ప పుణ్యం వస్తుంది...
భగవంతుడి ముందు అందరం స మానమే!.
అందరూ సామాన్యులమే! అనేభా వం భక్తుడుమనస్సులో నింపుకొ ని, ఎటువంటి ఫలితాన్ని ఆశించ కుండా దేవాలయంలో సేవ చేస్తే!, భగవంతుడు తప్పకమనల్నిఅను గ్రహిస్తాడు.
దేవాలయంలో మనం చేసే సేవ,ఆ భగవంతుడి పూజ కన్నా ఎక్కువై నదే! అనటంలో సందేహం లేదు.
దేవాలయంలో మనం చాలా సేవ లు శ్రద్దగా స్వయమూగా చేయ వ చ్చును అది ఒక గొప్పయోగం.
అవిఈక్రిందివిధముగాచేయవచ్చును....
1.దేవాలయం గచ్చుబండలు తడి గుడ్డతో తుడవడం.
2.భగవంతుడు (విగ్రహం) ధరించి న వస్త్రాలు ఉతకడం.
3.దేవుడిఊరేరిగింపులో, దేవ రా జదం డములు,దేవచిహ్నములు, ఆయుధములు,వింజామరలు,ఛత్రములు,దర్పణములు,కరదీపములు,వాహనములు, పల్లకీలు మోయడము.
4.దేవుడి పూజ సామాగ్రిని తోమి శుభ్రం చేయడము.
5.దేవాలయప్రాంగణమును ఊ డ్చి,బూజులు,చెత్తలేకుడాశుభ్రంచే యడము.
6.దేవుని విగ్రహాల అలంకరణ కోసం పూలమాలలు కట్టడము.
7.దేవుడి అలంకరణలోవస్తువులు స మకూర్చిసహాయంచేయడము.
8.దేవుడిపూజకు,తగుపూజాసామాన్లు సర్దడము.
9.దేవుడి అభిషేకం కోసంపండ్లరస ములు ప్రసాదములలోకి పదార్థా లను సమకూర్చటము,వండటం / సర్దడం దేవుడి తీర్థ ప్రసాదాలుఅం దరకు పంచడము.
10.దేవాలయం గోడలు / గోపురా లు,మంటపములు,యాగశాలలు, గుడులపైనమట్టీని,గోపురముమీద బూజు దులపడము.
11.అన్నదాన కార్యక్రమంలోవంట కు కూరలు తరగుట,వంకు సహా యము చేయడము,భక్తులకు భో జనము,మంచినీరు,పదార్ధములువడ్డించటము.
12.దేవుడి పూజ యొక్క నిర్మా ల్యమును శుభ్రం చేయడము.
14.దేవుడి కళ్యాణంలో అర్చకుల కుభక్తులకుసహాయంచేయడము.
15.దేవాలయమున కొబ్బరికాయ లు కొటటము.
16.దేవాలయముముందు భక్తుల పాదరక్షలు కాపుకాచి అందించట ము.
ఇలా అనేకమైన అమూల్యమైన సేవలన్నిటినీ హెచ్చు తగ్గులులేక అలా ఆలోచించక అన్నీభగవంతు ని సేవించు చున్నభావనతో చేసే వారిని భగవంతుడు తప్పక వెం న్నంటి ఉండిరక్షిచునని శాస్త్రవచ నము.
*సర్వేషాంశాన్తిర్భవతు.*
*శివశక్తిరూపాయనమశ్శివాయ.*
*ఓం. ఐం. హ్రీం. శ్రీం శ్రీమాత్రేన మః.*
(శక్తి ఆరాధనయే శ్రీచక్ర ఉపాసన.)
*సర్వేషాంస్వస్థిర్భవతు.*
*ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ. సింగరేణిసూపర్ బజారువెనుక. కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*