logo

మహమ్మద్ రఫీ గారి 100 వ జయంతి సందర్భం గా రెట్రో రాగాస్ VS మూర్తి బృందం స్వర నీరాజనం 09.01.2025

నిజాంపేట్ ... గాన సామ్రాట్ స్వర్గీయ మహమ్మద్ రఫీ గారి 100 వ పుట్టినరోజు సందర్భం గా ..హైదరాబాద్ లో నిజాంపేట లో ఉన్న అత్యాధునిక సాంకేతికత ఉన్న రెట్రో రాగాస్ డిజిటల్ AV studio లో అద్భుతమైన సంగీత విభావరి జరగనున్నట్లు రెట్రో రాగాస్ అధినేత ,అద్భుత గాయకులు, anchor, యాక్టర్ & karaoke jockey మరియు ప్రఖ్యాత అవార్డ్స్ లో ఒకటైన ఘంటసాల - NTR lifetime Achievement Award గ్రహీత Dr. శ్రీ. V.S.మూర్తి గారు నిన్న మీడియా తో మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
బుధవారం మీడియా తో మాట్లాడుతూ రెట్రో రాగాస్ అనే సంస్థ నిస్వార్ధ పూరితం గా లాభపెక్ష లేకుండా గాయని గాయకులని ప్రోత్సాహించడానికి స్థాపించింది అని తెలిపారు.

గురువారం అనగా 9.1.2025 న సాయంత్రం 4.00 నుంచి 8.00 వరకు.... జరగబోయే MD రఫీ గారి నూరవ పుట్టినరోజు సందర్భం గా జరగబోయే కార్యక్రమం లో అద్భుతమైన గాయని గాయకులు అయిన శ్రీ VS మూర్తి గారు, హ్రితికేష్ గారు, శ్రీనివాస్ గారు, వేమూరి మణీ గారు, వెంకటేష్ గారు, శ్రీధర్ గారు, రామ శాస్త్రిగారు, శంకర్ గారు,కృష్ణ గారు,రామలక్ష్మి గారు, నిసీజ రమణి గారు,లక్ష్మి శ్యామ్ గారు వంటి ప్రముఖులు పాల్గొంటున్నారని Dr. శ్రీ మూర్తి గారు తెలిపారు.

ఈ కార్యక్రమం లైవ్ రెట్రో రాగాస్ లైవ్ లో సాయంత్రం అందరు వీక్షించి తమ అమూల్యమైన కామెంట్స్ తో గాయనిగాయకులని ప్రోత్సాహించాలని, అలాగే యే స్టూడియో లో లేని విధం గా ప్రేక్షకులు ఇచ్చే కామెంట్స్ స్క్రీన్ మీద కనిపించే అద్భుత సాంకేతికత రెట్రో రాగాస్ లో ఉందని శ్రీ. మూర్తిగారు తెలిపారు.

76
10130 views