logo

బుచ్చంపేటలో లేగదూడల ప్రదర్శన

మండలంలోని బుచ్చింపేట గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఉలబాల రాము ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేలుజాతి లేగ దూడల పెంపకం మరియు పశుసంపద అభివృద్ధి చేయటం. కార్యక్రమంలో పాల్గొన్న రావికమతం ఏడి డాక్టర్ పుష్ప మాట్లాడుతూ ప్రతి రైతు మేలుజాతి పశువులు పెంచాలని సరైన సమయంలో నట్టల నివారణ మందులు తాగించాలని సూచించారు. ప్రదర్శన కార్యక్రమములో 50 లేగదూడలు పాల్గొన్నాయి ప్రదర్శనలో మొదటి బహుమతి వెంకటస్వామి రెండవ బహుమతి చిన్నోడు మూడో బహుమతి రెడ్డి రాజుబాబు దక్కించుకున్నారు కార్యక్రమంలో పాల్గొన్న రైతులందరికీ బహుమతులు నట్టల నివారణ మందులు కనుజుల మందు మరియు లివర్ టానిక్కులు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బుచ్చంపేట డాక్టర్ సి బాల మౌనిక డి ఎల్ డి ఏ (పశుగణాభివృద్ధి శాఖ )డాక్టర్ సౌజన్య డాక్టర్ బాల తేజ డాక్టర్ జాహ్నవి పశువైద్య సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు

10
1059 views