logo

నంద్యాల జిల్లా: నంద్యాల రూరల్ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్.

నంద్యాల జిల్లా:
జనాభా ప్రాతిపదికన మేరకు నంద్యాల అర్బన్ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని సత్వర రెవెన్యూ సర్వీసుల సౌలభ్యం కొరకు రెండు భాగాలుగా విభజించి రూరల్ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. మంగళవారం స్థానిక అర్బన్ తాసిల్దార్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటైన రూరల్ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ లతో కలిసి ప్రారంభించారు.*
👉ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫారుక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం జిల్లా కేంద్రమైన తర్వాత జనాభా అధికమైన నేపథ్యంలో రూరల్, అర్బన్ మండలాలుగా విభజించి ప్రజలకు రెవెన్యూ సర్వీసులను సరళీతరం చేసేందుకు రూరల్ తాసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గతంలో నంద్యాల పట్టణ కేంద్రంలో అనేక మంది మేధావులు, అధికారులు పనిచేసి అభివృద్ధి చేశారన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి అన్ని కార్యాలయాలు ఒకే ప్రదేశానికి తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. రాయలసీమ జిల్లాలలో నంద్యాల జిల్లాకు మంచి పేరు ఉందని ప్రజలు, అధికారులు సహకరించి జిల్లాను అభివృద్ధి చేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
👉జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని భూ సంబంధిత దరఖాస్తులు, ఇతర సర్వీసులకు సంబంధించిన అంశాలు అధికంగా ఉన్న నేపథ్యంలో నంద్యాల రూరల్ మండల ఏర్పాటుకు నిమిత్తం ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఈ మేరకు మంత్రి చేతుల మీదుగా నంద్యాల అర్బన్ తాసిల్దార్ కార్యాలయ భవన ప్రాంగణంలోనే రూరల్ మండల కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామన్నారు. రూరల్ మండల కార్యాలయ పరిధిలో 13 రెవెన్యూ గ్రామాలు వస్తాయన్నారు. మండల పరిధిలోని సచివాలయాలను కూడా అనుసంధానం చేసి అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందించేందుకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ తెలిపారు. అనంతరం మండల కార్యాలయ ఆవరణలో మంత్రి, కలెక్టర్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

0
6 views