logo

కాంగ్రెస్ నాయకుడు కొండూరు గంగాధర్ అంత్యక్రియలకు హాజరైన డిసిసి అధ్యక్షులు 07/01/2025



కాంగ్రెస్ నాయకుడు కొండూరు గంగాధర్ అకస్మాత్తుగా మరణించాడు. విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు గారు మంగళవారం ఉదయం నిర్మల్ రూలర్ మండలంలోని లంగాడాపూర్ గ్రామంలో గంగాధర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. గంగాధర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, గౌరవార్ధం కాంగ్రెస్ జెండా కప్పారు. ఈ సందర్భంగా అంత్యక్రియలకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. శ్రీహరి రావు గారితో నిర్మల్ పురపాలక సంఘం అధ్యక్షులు గండ్రత్ ఈశ్వర్ గారు, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్ రెడ్డిగారు, నిర్మల్ పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్ను, కొంతం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

1
49 views