logo

ప్రజలపై విద్యుత్ భారాలొద్దు. - ట్రూ అప్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలి. - ప్రజలుకోరని స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు. - ప్రభుత్వమే భారాలు భరించాలి. - వామపక్షాల సామూహిక రాయబారం. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

ప్రజలపై విద్యుత్ భారాలొద్దు.
- ట్రూ అప్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలి.
- ప్రజలుకోరని స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు.
- ప్రభుత్వమే భారాలు భరించాలి.
- వామపక్షాల సామూహిక రాయబారం.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist-విశాలాంధ్ర-
విజయవాడ(చిట్టినగర్): ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు భారాలు రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (ఇఆర్ సి) బహిరంగ విచారణ జరుగుతున్న సందర్భంగా మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో విద్యుత్ బారాలు పడుతున్న వినియోగదారులకు సామూహిక రాయబారం పేరుతో జరిగిన నిరసనకు సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకు కరెంటు భారాలు వేయనని హామీతో అధికారంలోకి వచ్చాడని చెప్పారు. అధికారం వచ్చాక ప్రజలపై విద్యుత్ బారాలు మొదటి దపా రూ. 6072 వేల కోట్లు, రెండవ దపా రూ 9412 వేలకోట్లు భారాలు వేయటం మోసమన్నారు. ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ కమిషన్ వారికి ఇచ్చిన 36 పేజీల నివేదికను చదివారో..! లేదో..? అనుమానం కలుగుతుందని వ్యక్తపరిచారు. పట్టణాలలో, గ్రామాలలో ప్రజలుకోరని స్మార్ట్ మీటర్లకు వేల కోట్ల ఖర్చు ఎందుకని..? సెకి అదానీతో
25 సంవత్సరాల పాటు ఒప్పందం, ఒక లక్ష పదివేల కోట్ల భారం వినియోగదారులపై పడనుంది. అదానీ లాభం కోసం కాదా...? అని ప్రశ్నించారు. సోలార్ పవర్ గుజరాత్, రూ. 1.99 అయితే రూ. 2.90 కు ఒప్పందం ఎందుకు, వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. ప్రపంచంలో భారతదేశానికి మర్యాద పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో సంస్థలో వ్యక్తుల నుండి
గౌతమ్అదాని, సాగర్ అదానీలకు
కోర్టు నోటీసులు ఇచ్చారని చెప్పారు. అందుకనే చంద్రబాబు నాయుడు అదానీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, కరెంటు బారాలు ప్రభుత్వ భరించాలన్నారు.10 తేదీన కర్నూలులో జరిగే ఇఆర్ సి బహిరంగ విచారణలో కూడా నిరసన వ్యక్తం చేస్తామన్నారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలతో కలిపి పోరాటాలను కొనసాగించి పోరాటం ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వినియోగదారుల ప్రయోజనాల కోసం ఉండాలన్నారు. రెండు సంవత్సరాలగా ఈ ఆర్ సి తీరు గమనిస్తే వినియోగదారుల బాధలు పట్టించుకోవటం లేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలలో హామీ ప్రకారం ప్రజలపై కరెంటు భారాలు లేకుండా చూస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి వేల కోట్ల బారాలు వేయటం క్షమించరాని నేరమన్నారు. నరేంద్ర మోడీ అదానీ ఒప్పందంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని లొంగదీసుకున్నారన్నారు. అందుకే బాబు నోరు విప్పట్లేదని, ప్రజల నమ్మకాన్ని వోమ్ము చేస్తున్నారని చెప్పారు. డిస్కంల అప్పులు ప్రభుత్వమే భరించాలని, ప్రజలు కూడా తీవ్ర అప్పుల్లో ఉన్నారని, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర అంటూనే ప్రజలను చీకటి యుగములో బంధించటం భావ్యం కాదన్నారు. ఇఆర్ సి లో వినియోగదారులకు అనుకూలంగా మార్పులు రావాలని కోరారు. సెకి ఒప్పందం, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వినియోగదారులపై భారాలు మోపితే వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ (ఐఎఫ్టియు) రాష్ట్ర నాయకులు పీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలపై కరెంటు భారాలు మోపితే, ప్రజలను వంచించినట్లేనని కూటమీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం వామపక్షాల ఉద్యమాలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (ఈఆర్ సి) చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, మెంబర్ పివిఆర్ రెడ్డి లకు వామపక్ష నాయకులు శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రసాద్, బాబూరావు కాశీనాధ్, కృష్ణ తమ బృందాలతో కలసి వినతి పత్రాలు అందజేశారు. తదనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి హెచ్ బాబురావు మాట్లాడుతూ అదానీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, అవినీతి ఒప్పందాలు రద్దు చేసే అధికారం ఇఆర్ సి కి ఉందన్నారు. తమ స్వతంత్రతను కాపాడుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కొట్టు రమణారావు, మూలి సాంబశివరావు, నాయకులు కె ఆర్ ఆంజనేయులు, తూనం వీరయ్య, తెడ్డు వెంకటేశ్వరరావు, కే ఆనందరావు, సింగరాజు సాంబశివరావు, ఆర్ గురునాథం, డి సీతారావమ్మ, సీపీఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కార్పొరేటర్ బి సత్యబాబు, మాజీ కార్పొరేటర్లు కే శ్రీదేవి, గాదే ఆదిలక్ష్మి, కే సరోజ, నాయకులు జీ నటరాజ్, కే దుర్గారావు, కృష్ణా, టీ ప్రవీణ్, సిహెచ్ శ్రీను, ఎం నాగేశ్వరరావు, ఝాన్సీ, దేవి, షకీలా, పిచ్చమ్మ, వెంకటరత్నం, ఐఎఫ్టియు నాయకులు పి పోలారి తదితరులు పాల్గొన్నారు.

2
692 views