logo

మరణించిన పోలీసు కుటుంబాలకు చేయూత అందజేత - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.




❇️ *మరణించిన హెూంగార్డు, పోలీసు కానిస్టేబులు కుటుంబానికి 'చేయూతను అందజేసిన జిల్లా ఎస్పీ*

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల మరణించిన హెూంగార్డు మరియు పోలీసు కానిస్టేబులు కుటుంబాలకు "చేయూత"ను అందించేందుకు పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన మొత్తాన్ని జిల్లా ఎస్పీ వకుల్
జిందల్, ఐపిఎస్ గారు జనవరి 7న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవ
సాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు మరియు హెూంగార్డు కుటుంబాలు అర్ధంతరంగా
తమ కుటుంబ యజమానిని కోల్పోయి, ఆర్ధికంగా నష్టపోయిన సమయంలో వారికి ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ అందేంత వరకు వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకొనేందుకు పోలీసుశాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్చందంగా
ముందుకు వచ్చి, కొంత మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు "చేయూత”గా అందజేయడం అభినందనీయ
మన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు
అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని బలిజిపేట పోలీసు స్టేషనులో హెూంగార్డుగా పని చేస్తున్న బి.నారాయణ
స్వామి ఆకస్మికంగా డిసెంబరు 6న మరణించగా, వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు 'చేయూత'గా హెూంగార్డ్సు ప్రోగు చేసిన ఒక్క రోజు అలవెన్సు రూ.3,30,150/- ల చెక్ ను వారి సతీమణి బి. శారదకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.

జిల్లా పోలీసుశాఖలో విజయనగరం జిల్లాలో కానిస్టేబులుగా పని చేస్తూ, కే.తిరుపతి నాయుడు అనారోగ్య కారణాలతో నవంబరు 9న మరణించగా, వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకొనేందుకు 'చేయూత'గా పోలీసు సిబ్బంది ప్రోగు చేసిన రూ.1,48,300/- ల చెక్ ను వారి సతీమణి కే. నారాయణమ్మకు జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జిల్లా
పోలీసు కార్యాలయంలో అందజేసారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని, వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని, ఇతర దృవీకరణ పత్రాలను జతపర్చి జిల్లా పోలీసు కార్యాలయానికి
అందజేయాలని వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత,
డిపిఓ సూపరింటెండెంట్ శ్రీ ఎ.ఎస్.వి.ప్రభాకర రావు మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

*||జిల్లా పోలీసు కార్యాలయం,||*
*||విజయనగరం||*

0
124 views