logo

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రావడం సరైంది కాదని, ప్రధాని మోడీ పర్యటన వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన

07-01-2025
నంద్యాల

రాష్ట్రానికి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా ఏపీకి పార్లమెంట్లో విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, విశాఖ పట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రావడం సరైంది కాదని, ప్రధాని మోడీ పర్యటన వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగిందని సిపిఎం నంద్యాల పట్టణం కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ తెలియజేశారు.

10
1369 views