logo

HMPV వైరస్ కు కోవిడ్ కు సంబంధం లేదు.......... డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

07-01-2025
కర్నూలు

ఇది 2001లో కనుగొనబడిన పాత వైరస్సే.. కోవిడ్ లాగా కొత్తగా వచ్చిన వైరస్ కాదు.. కోవిడ్ లాగా ఎక్కువ మందికి ఇది సంక్రమించే అవకాశం లేదు.. మనము ఎక్కువగా భయపడవలసిన పని లేదు...

ఇది ప్రతి సంవత్సరము చలికాలంలో వచ్చే జలుబు లేదా సర్ది లాగే ఉంటుంది.. జలుబు తుమ్ములు పొడి దగ్గు వస్తుంది.. ఎన్నో వైరస్ల వల్ల మనకు ప్రతి సంవత్సరము జలుబు వస్తూ ఉంటుంది.. ఏమంటే ఇంతకుముందు మనకు వాటిని పరీక్ష చేసేది తెలియదు.. ఇప్పుడు ఆర్టీపిసీఆర్ ల్యాబ్స్ ఉన్నందువలన వాటిని పరీక్ష చేసి దాని యొక్క పేర్లు పెడుతున్నారు.. మీడియా వలన ఎక్కువగా సమాచారం అందరికీ చేరుతూ ఉంది..

ఏ వైరల్ జలుబు అయినా కానీ ముక్కులోనే ఉండకుండా అది కింద గొంతు ఊపిరితిత్తులలోకి వెళ్లి బ్రాంకైటిస్తే నిమోనియా కలగచేయవచ్చు.. అది చిన్న పిల్లల్లో, వృద్ధులు లో మరియు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారిలో క్యాన్సర్ పేషెంట్స్ లో కొంత నిమోనియా కలిగించి ప్రమాదం కలగజేయవచ్చు.. వీటికి అన్ని ఆసుపత్రులలో వైద్యం అందించే సదుపాయం కలదు.. కావున భయపడే పనిలేదు...

కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరియు తుంపరలు వలన ఇన్ఫెక్షన్ మనకు రాకుండా మనుషులు కొంత దూరంగా ఉండటం మంచిది.. ఒకవేళ వచ్చిన భయపడవలసిన పని లేదు మనము సర్ది లేదా జలుబు మాత్రలు వేసుకుంటే సరిపోతుంది.. సెట్రిజిన్ పారాసెటమాల్ సరిపోతుంది.. రెస్టు తీసుకోవడం బాగా నీరు తాగడం చాలా ఇంపార్టెంట్.. దీనికి ఎటువంటి యాంటీ వైరల్ మందులు కానీ వ్యాక్సిన్ కానీ లేదు.. ఒకవేళ చిన్నపిల్లల లో బ్రాంకైటీస్ లేక నిమోనియా వచ్చి ఆయాసం ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి పోతే ఆక్సిజన్ పెడతారు.. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు..

కాకపోతే మనకు మామూలు జలుబు వచ్చినా కానీ ఇదిఅదేను అబ్బా అని భయపడించేవారు అంటారు.. మామూలు నర్ది జలుబు రాకుండా ఓ రూపాయి పెట్టి మాస్కు కొనుక్కొని వేసుకుంటూ ఉండండి బయటకి వెళ్ళినప్పుడు.. ప్రస్తుతం చేయగలిగినది ఇదే!

భారత ప్రభుత్వము కర్ణాటక ప్రభుత్వము పైన చెప్పిన అడ్వైజరీ నోట్ ఇచ్చింది.. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వైరస్ ఇప్పటికి 7-1-2025 కు నమోదు కాలేదు...అయినా ఇది కోవిడ్ లాగా మహమ్మారి అయ్యే అవకాశం లేదు ఎందుకంటే దీని ట్రాన్స్మిషన్ చాలా తక్కువ.. కావున అనవసరమైన భయాందోళనకు గురికాకుండా కూల్ గా ఉండండి...

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు.

38
4424 views