నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారు
బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామంలో ఈరోజు గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మణానికి మరియు కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో గల జగదాంబ దేవి, సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ మందిరంలో పూజలు చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మహిళలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల అంగన్ వాడి కేంద్రాన్ని పరిశీలించారు. ఇదే సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటిస్తూ పర్యటించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ సమస్యలు ఏవి ఉన్న ధైర్యంగా ముందుకు వచ్చి నమ్మకంతో అడగండి కచ్చితంగా గ్రామాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.