
బిట్స్ లో ఘనంగా వింటర్ డే సెలబ్రేషన్స్
స్థానిక భూపాలపల్లి పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో శీతాకాలాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు వింటర్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. విద్యార్థులందరూ శీతాకాలంలో ధరించే దుస్తులను ధరించి, శీతాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రిన్సిపాల్ శ్రీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ శీతాకాలంలో విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకొని ఏ విధంగా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరియు ఎలాంటి దుస్తులు ధరించాలో అవగాహన కలిగించేలా విద్యార్థులందరు చక్కని ప్రదర్శన చేశారని, ఈ ప్రదర్శన విజయవంతం కావడంలో సహకరించిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చలికాలంలో చలి తీవ్రత తట్టుకోవడానికి విద్యార్థులు ఉన్ని దుస్తులు ధరించాలని, చర్మం పగలకుండా ఉండడానికి వాజ్ లెన్ లాంటి పదార్థాలు వాడాలని మరియు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా శీతాకాలంలో లభించే ఆపిల్, ఉసిరి, డ్రాగన్ ఫ్రూట్,స్వీట్ పొటాటో మరియు రేగు పండ్లు తినాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.