logo

"అదరహో " అనిపించిన "స్వర బృందావనం" 10 వ సంగీత విభావరి "మెగా ఈవెంట్"

04.01.2025 తేదీన రథ సారథులు శ్రీ రవికాంత్ శ్రీ కుమార్ ల సారధ్యంలో కళాభారతి సిటీ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ లో "స్వర బృందావనం" 10 వ సంగీత విభావరి "మెగా ఈవెంట్" గా అవతరించి ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి "అదరహో" అనిపించింది.
"రవి శ్రీ" ద్వయం నిర్వహించే అద్భుతమైన సంగీత విభావరులకు ముగ్ధులైన పలు వ్యాపారవేత్తలు, సంగీతాభిమానులు తమ అభిమాన పూర్వకమైన ఆర్థిక సహాయ సహకారాలను అందించి, కార్యక్రమ అద్భుత నిర్వహణకు ఇతోధికంగా తోడ్పడ్డారు.
UPVC రంగంలో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసే సంస్థ "Kalinga Nimmi Industries Private Limited" ఇది 2014 లో శ్రీ బి. శ్రీ వర్ధన్ గారిచే విశాఖపట్నం లో స్థాపించబడింది. ఈ సంస్థ UPVC Glass windows, Flush doors, Sliding doors, Sliding windows వంటి ఎన్నో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసి ఫార్మా కంపెనీ లకు, లాబొరేటరీలకు, అపార్ట్మెంట్ లకు ఉపయోగపడుతున్నది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వర్ధన్ గారు "స్వర బృందావనం" మెగా ఈవెంట్ కి గాయనీ గాయకులను ప్రోత్సహిస్తూ ఘనమైన ఆర్థిక సహకారాన్ని అందజేశారు.
అలాగే "Sudhena Agro Forms Private Limited" అధినేత శ్రీ భరత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న గాయనీ గాయకులకు మెమొంటోలను స్పాన్సర్ చేశారు. ఎర్ర చందనం సాగుకు అనుకూల వాతావరణం ప్రకాశం జిల్లా కనిగిరి లో ఉంది. ఈ ప్రదేశం లో శ్రీ భరత్ రెడ్డి గారు 6 వెంచర్ లను పూర్తిచేసి 7 వ వెంచర్ ను ప్రారంభించనున్నారు. కేవలం 8 లక్షల రూపాయలకు 1210 చదరపు గజాలు (పావు ఎకరం) భూమితో పాటు 100 ఎర్ర చందనపు చెట్లు పెంచి, 12 - 14 ఏళ్ల తరువాత వాటిపై వచ్చే ఆదాయం లో 60% అనగా కనీసం కోటి రూపాయలు భూమి కొన్న కష్టమర్ కి అందజేస్తారు. ఈ విషయానికి లిఖితపూర్వక హామీ కూడా ఉంటుంది.
అలాగే ఔత్సాహిక గాయనీ గాయకులు కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించి తమ ఉన్నతమైన మనస్సును చాటుకున్నారు. గాయకులలో ఒకరైన వేదవ్యాస్ గారి తండ్రి గారు శ్రీ టి. రాజేశ్వర రావు గారు గాయనీ గాయకులు అందరికీ "భోజన సదుపాయాలను", మరొక గాయకుడు రాజకుమార్ "Participation Certificates" ను అందజేశారు.
ఇక కార్యక్రమం లోనికి వెళితే ముందుగా రాంబాబు వినాయక ప్రార్ధన చేయగా, పిమ్మట బ్రహ్మానందం "వినరో భాగ్యము" అంటూ అన్నమయ్య ను, వెంకటేశ్వర స్వామిని కూడా ప్రత్యక్షం చేశారు. అనంతరం శ్రీ కుమార్ సమీర లు "కదిలింది శ్రీ సాయి పల్లకీ" అంటూ సాయినాథుని స్తుతించారు. నాగేశ్వరరావు శారద లు "మాటే మంత్రము" అంటూ భార్యాభర్తల జీవితం పూవు తావి లా ఉండాలని ఆకాంక్షించారు. శ్రీధర్ సమీర లు "మ్రోగింది కళ్యాణ వీణ" అంటే రాజకుమార్ లక్ష్మి లు "చిట్టి గుమ్మ పదవే" అంటూ వంత పాడారు. ప్రసాద్ సీత లు "పొరుగింటి మీనాక్షమ్మ ను చూశారా" అంటూ భార్యాభర్తల చిలిపి తగాదాలను వివరించారు. వేదవ్యాస్ యశోద లు "పువ్వుల్లో దాగున్న పళ్లెంతొ అతిశయం" అని అతిశయమైన విషయాలను మన కళ్ల ముందు పెడితే, రవికాంత్ శారద లు "ధీర ధీర ధీరా" అంటూ ధీరుల అతిశయాన్ని అభివర్ణించారు. బ్రహ్మానందం సీతాకుమారి లు "నీ చరణ కమలాల నేనున్న చాలు" అంటూ భార్యాభర్తల అనురాగ బంధాలను వివరిస్తే, రవికాంత్ రాజేశ్వరి లు "వన్ టూ త్రీ ఫోర్" అని హుషారెత్తించారు. రాజకుమార్ యశోద లు "కదిలే కాలమా" అంటూ కాలాన్ని వెనక్కి రమ్మంటే, సురేంద్ర సమీర లు "ప్రియతమా నను పలకరించు ప్రణయమా" అని బ్రతుకు లోని బంధాన్ని చాటారు. రవికాంత్ సీతాకుమారి లు "కవ్వించే ఓ ప్రేమా" అని ప్రేమ గొప్పదనాన్ని చాటితే, వెంకట్ సీత లు "కనులలో నీ రూపం" అంటూ మురిపించారు. సురేంద్ర శ్రీ రాణి లు "తెలుసా మనసా" అని మనసు లక్షణాన్ని విప్పితే, వెంకట్ సమీర లు "నేడే ఈనాడే" అంటూ మమతల మాటలు చెలిమికి కానుకలని చాటారు. శ్రీ కుమార్ శారద లు "మానస వీణ మధు గీతం" అంటూ సంసారం లోని సరిగమలు వివరిస్తే, మళ్లీ శ్రీ కుమార్ రాజేశ్వరి లు "మై నేమ్ ఈజ్ బంగారయ్యా" అంటూ పెద్దలు హితులు చెప్పిన మాటలను వినాలని హితవు పలికారు. రవికాంత్ సురేంద్ర లు "దోస్త్ మేరా దోస్త్" అంటూ స్నేహ మాధుర్యాన్ని వివరిస్తే, వేదవ్యాస్ యశోద లు "సిరులొలికించే" గీతంతో తల్లీబిడ్డల అనుబంధాన్ని తెలియజెప్పారు.
ఈ కార్యక్రమానికి భువనేశ్వర్, విశాఖపట్నం, ఏలూరు ప్రాంతాలనుండి కూడా గాయనీ గాయకులు విచ్చేసి "స్వర బృందావనం, రవి శ్రీ" లపై గల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అవిశ్రాంతంగా సాగిన ఈ "స్వర బృందావనం" 10 వ సంగీత విభావరి "మెగా ఈవెంట్" ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి "అదరహో" అనిపించింది.

99
2778 views