
ఈనెల 27న ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ఎన్నికలు*
*ఈనెల 27న ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ఎన్నికలు*
....ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారులు సాటిగంగాధరం, చల్లా జయచంద్ర.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) చిత్తూరు జిల్లా శాఖ ఎన్నికలు జనవరి 27న నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారులు సాటి గంగాధర్ చల్ల జయచంద్రాలు వెల్లడించారు ఆదివారం చిత్తూరు లోని యూనియన్ జిల్లా కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం రాజీలేని పోరాటం చేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు జర్నలిస్టులు అందరూ సహకరించాలని కోరారు. యూనియన్ సభ్యత్వ దరఖాస్తులు జిల్లా యూనియన్ కార్యాలయంలో నియోజకవర్గాలలోని కో కన్వీనర్ల వద్ద అందుబాటులో ఉంటాయని వెల్లడించారు అంతేకాకుండా యూనియన్ అధికారిక వాట్స్అప్ గ్రూప్లో కూడా దరఖాస్తు ఫారంలో డౌన్లోడ్ చేసుకొని సమర్పించవచ్చని పేర్కొన్నారు ఈనెల 5 నుండి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడుతుందని తదనంతరం ఎన్నికల ప్రక్రియ 23 వరకు నామినేషన్ల స్వీకరణ స్క్రూట్ ని నిర్వహించబడుతుందని వెల్లడించారు జనవరి 27న చిత్తూరులోని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు జర్నలిస్టులు ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.