logo

ఉత్తమ సేవా పథకం అందుకున్న వెంకట్రావు

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గల బిచ్కుంద మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సుర్నార్ వెంకట్రావు పటేల్ కు ఉత్తమ సేవా పథకం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖలో ఉన్నతమైన సేవలందిస్తున్నటువంటి అధికారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అందిస్తున్నటువంటి పథకాలలో భాగంగా కామారెడ్డి జిల్లాలో 15 మంది పోలీస్ అధికారులు ఎన్నికయ్యారు. అందులో జుక్కల్ మండలం లాడేగాం గ్రామానికి చెందిన సుర్నార్ వెంకట్రావు పటేల్ నిజాయితీగా నిబద్ధతతో విధులు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇతని సేవలు గుర్తించి ఇట్టి ఉత్తమ సేవ పథకం అందించింది. ఇట్టి పథకం పొందినందుకు తన సొంత గ్రామం లాడేగవ్ గ్రామ ప్రజలు మరియు బిచ్కుంద మండల వాసులు పలువురు అభినందనలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

1
2998 views