తిరుమల శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖ
తిరుమల శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ మేరకు లేఖ రాశారు. ప్రతివారం (సోమవారం నుంచి గురువారం) ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం కోసం 2 లేఖలు, ప్రత్యేక దర్శనం కోసం 2 లేఖలు స్వీకరించబోతున్నట్లు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.